Ram Charan: 'పెద్ది' టీమ్ తో కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్

Ram Charan Wishes Vinayaka Chavithi with Peddi Team
  • నేడు వినాయక చవితి
  • సాంగ్ షూటింగ్ ప్రారంభించిన 'పెద్ది' టీమ్
  • సెట్స్ పై గణేశ్ చతుర్థి సందడి 
  • వీడియో షేర్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో 'పెద్ది' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా సెట్స్ పైనుంచి రామ్ చరణ్ 'పెద్ది' టీమ్ తో కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ గణేశ్ చతుర్థి" అని రామ్ చరణ్ చెప్పగానే, "గణపతి బప్పా మోరియా" అంటూ చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"రెహమాన్ గారి డప్పు... రామ్ చరణ్ గారి స్టెప్పు... నన్ను నమ్మండి... ఇది మెగా పవర్ బ్లాస్ట్" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.
Ram Charan
Peddi
Buchi Babu Sana
Ganesh Chaturthi
Vinayaka Chavithi
AR Rahman
Mega Power Blast
Telugu Movie

More Telugu News