పాపాల భైరవుడు బీఆర్ నాయుడిని స్వామివారే తరిమికొడతారు: అంబటి రాంబాబు
- టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
- భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలన్న టీటీడీ చైర్మన్
- బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు
- కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి ఎవరూ తరిమికొట్టలేరని స్పష్టీకరణ
టీటీడీపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కరుణాకర రెడ్డిని తిరుపతి నుంచి తరిమి కొట్టడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. కానీ... పాపాల భైరవుడు బీఆర్ నాయుడిని మాత్రం స్వామి వారే తరిమి కొడతారని అంబటి ట్వీట్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ముంతాజ్ హోటల్ కు భూ కేటాయింపుల వ్యవహారం వివాదం రూపుదాల్చింది. దీనిపైనే వైసీపీ నేతలకు, టీటీడీ చైర్మన్ కు మాటల యుద్ధం జరుగుతోంది.