Trinetra Ganesha: ఆలయం దాకా వెళ్లక్కర్లేదు.. ఉత్తరం రాస్తే చాలు కోర్కెలు తీర్చే వినాయకుడు

Trinetra Ganesha Temple in Rajasthan Receives Letters of Prayers
  • రాజస్థాన్ లోని రణథంబోర్ లో త్రినేత్ర గణేశుడి ఆలయం
  • ఆరావళి, వింధ్య పర్వతాల్లో రాజుల కాలంలో నిర్మాణం
  • రోజూ వేలాదిగా స్వామి వారికి ఉత్తరాలు, శుభలేఖలు
వ్యయప్రయాసలకు ఓర్చి ఆలయం దాకా వెళ్లక్కర్లేదు.. చిన్న ఉత్తరం ముక్క రాస్తే చాలు.. మీ కష్టాలను కడతేర్చే పని స్వయంగా ఆ వినాయకుడే చూసుకుంటాడట. ఇది రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లా రణథంబోర్ లో ఉన్న త్రినేత్ర గణేశుడి ఆలయం ప్రత్యేకత అని స్థానికులు చెబుతున్నారు. రోజూ స్వామి వారికి వందలాదిగా ఉత్తరాలు వస్తుంటాయని స్థానిక పోస్టల్ సిబ్బంది తెలిపారు. స్వామీ నా కష్టం ఇది, నా కోరిక ఇది తీర్చవయ్యా అంటూ భక్తులు ఆ ఉత్తరాలలో వినాయకుడిని వేడుకుంటారట.

ఆరావళి, వింధ్య పర్వతాల్లో పదో శతాబ్దంలో అప్పటి రణథంబోర్ పాలకుడు మహారాజా హమ్మిరదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. అల్లాఉద్దీన్ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో రాజుగారి కలలోకి వినాయకుడు వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడట. దీంతో మహారాజా హమ్మిరదేవ తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడి భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు శుభ్‌, లాభ్‌ ఒకేచోట వెలిశారు.

కోర్కెలను చెప్పుకోవడంతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలంటూ వినాయకుడికి ఆహ్వాన లేఖలు కూడా పంపిస్తారు. త్రినేత్ర గణేశుడి ఆలయం, రణథంబోర్ గ్రామం, సవాయ్ మధోపుర్ జిల్లా, పిన్ కోడ్ 322021 చిరునామాకు నిత్యం వందలాది ఉత్తరాలు వస్తుంటాయని ఆలయ పండితులు తెలిపారు.
Trinetra Ganesha
Rajasthan
Ranthambore
Sawai Madhopur
Ganesh Temple
Lord Ganesha
Hindu Temple
письма
хаммирдев
khilji

More Telugu News