Vinayaka Chaturthi: 5 వేల భగవద్గీతలతో వినాయకుడు.. అబ్బురపరుస్తున్న వినూత్న రూపం

Ganesha Idol Made with 5000 Bhagavad Gitas in Chennai
షార్ట్స్‌లో చూడండి
వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు వినూత్న రూపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఏకంగా వేలాది పవిత్ర గ్రంథాలతో గణపతి విగ్రహాన్ని రూపొందించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

చెన్నైలోని మన్నాలి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ మండపంలో కొలువుదీరిన ఈ గణనాథుడు పూర్తిగా పుస్తకాలతోనే రూపుదిద్దుకున్నాడు. ఈ అద్భుత విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు ఏకంగా 5 వేల భగవద్గీత ప్రతులను వినియోగించడం విశేషం. వీటితో పాటు 1500 'వేల్ విరుత్తమ్', 1008 'మురుగన్ కావసం' వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ఈ రూపం కోసం వాడారు.

ఈ వినూత్న విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మండపం వద్ద చిన్నారులు భజనలు, సంకీర్తనలు చేస్తూ ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నారు. పవిత్ర గ్రంథాలతో రూపుదిద్దుకున్న ఈ గణనాథుడు జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తున్నాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Vinayaka Chaturthi
Ganesha
Chennai
Bhagavad Gita
Tamil Nadu
Ganesh idol
Hindu festival
Religious books
Murugan Kavassam
Mannali

More Telugu News