Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో మహిళ ప్రసవం
- కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన గర్భిణీ
- క్యూలైన్ లో ఉండగా పురిటి నొప్పులు, ప్రసవం
- తల్లీబిడ్డలను పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేర్పించిన కుటుంబం
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి వచ్చిన ఓ గర్భిణీ స్వామి సన్నిధిలోనే ప్రసవించింది. క్యూలైన్ లో ఉండగా పురిటి నొప్పులు రావడంతో తోటి మహిళా భక్తులు పురుడు పోశారు. ఆపై తల్లీబిడ్డలను పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. స్వామివారి సన్నిధిలో ప్రసవం జరగడంతో రేష్మ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితి పర్వదినాన తమ ఇంటికి గణనాథుడి కృపతో కొత్త సభ్యుడు వచ్చాడని మురిసిపోతున్నారు.