Narendra Modi: ట్రంప్ ఫోన్ కాల్స్ ను అవాయిడ్ చేసిన మోదీ!

Narendra Modi Avoided Trump Phone Calls Over Tariffs
  • జర్మనీ న్యూస్‌ పేపర్ లో కథనం
  • టారిఫ్ లపై భారత ప్రధాని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్య 
  • అమెరికా టారిఫ్ లకు తలొగ్గేదిలేదని స్పష్టమైన సంకేతాలు
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని జర్మనీ న్యూస్ పేపర్ ఓ కథనం ప్రచురించింది. టారిఫ్ ల విషయంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఫోన్ చేసినా మోదీ అందుబాటులోకి రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ట్రంప్ భారత ప్రధానికి నాలుగుసార్లు ఫోన్ చేశారని, ఒక్క ఫోన్ కాల్ కూడా మోదీ స్వీకరించలేదని తెలిపింది.

ఈ చర్యతో ట్రంప్ పై మోదీ తన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టారిఫ్ ల విషయంలో తలొగ్గేది లేదనే సందేశం పంపారని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాంక్ ఫర్టర్ అల్జెమైన్ జీటంగ్ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. జపాన్ న్యూస్ పేపర్ నికేయ్ ఆసియా కూడా దాదాపుగా ఇదే తరహా కథనం ప్రచురించింది.
 
భారత్ పై భారీగా టారిఫ్ లు విధించడం, పాకిస్థాన్ కి స్నేహ హస్తం చాచడం వంటి చర్యల కారణంగా భారతదేశంలో ట్రంప్ పై వ్యతిరేకత నెలకొందని జర్మనీ న్యూస్ పేపర్ తన కథనంలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పేర్కొనడం కూడా భారతీయుల ఆగ్రహానికి కారణమైందని వివరించింది.

పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం వెనుక విదేశాల పాత్ర లేదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేసినా ట్రంప్ పదే పదే తానే యుద్ధం ఆపానని చెప్పడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించింది.
Narendra Modi
Donald Trump
India US relations
Tariffs
Trade war
India Pakistan
Frankfurter Allgemeine Zeitung
Nikkei Asia
India foreign policy
US foreign policy

More Telugu News