YS Jagan: రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్

YS Jagan Greets People on Vinayaka Chavithi
  • నేడు వినాయక చవితి 
  • అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగాలని జగన్ ఆకాంక్ష
  • విజయాలు కలిగేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని ప్రార్థన  
వినాయక చవితి పర్వదినం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగి, విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ శుభ సందర్భంగా వైఎస్ జగన్ తన సందేశాన్నిస్తూ.. "రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలు కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి" అని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. 
YS Jagan
YS Jagan Mohan Reddy
Vinayaka Chavithi
Ganesh Chaturthi
Andhra Pradesh
YSRCP
Festival Greetings
Hindu Festival

More Telugu News