పార్టీలో తనను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారంటూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న నిరసన

  • సంస్థాగత ప్రధాన కార్యదర్శికి ఫుట్‌బాల్ కానుకగా ఇచ్చి నిరసన
  • రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై అసంతృప్తి
  • ఒకరిని కలిస్తే మరొకరిని కలవమంటున్నారని ఆవేదన
పార్టీలో తనను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారంటూ బీజేపీ నాయకుడు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్‌బాల్ ఇచ్చి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రశేఖర్ తివారీని కలిస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కలవమని చెబుతున్నారని, ఆయనను కలిస్తే అభయ్ పాటిల్‌ను కలవమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిని సంప్రదిస్తే మరొకరి పేరు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.


More Telugu News