Jayam Ravi: గాయని కెన్నీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయం రవి.. ‘దేవుడిని మోసం చేయలేరు’ అంటూ భార్య పోస్ట్!

Aartis Cryptic Posts After Actor Husband Ravi And Keneeshaas Temple Trip
  • గాయని కెన్నీషాతో కలిసి తిరుమల వెళ్లిన నటుడు జయం రవి
  • భర్త తీరుపై సోషల్ మీడియాలో స్పందించిన భార్య ఆర్తి
  • నెట్టింట వైరల్‌గా మారిన ఆర్తి పెట్టిన పోస్ట్
  • కొనసాగుతున్న జయం రవి, ఆర్తి విడాకుల వివాదం
కోలీవుడ్ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య జరుగుతున్న విడాకుల వివాదం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల జయం రవి తన స్నేహితురాలు, గాయని కెన్నీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయంపై ఆయన భార్య ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే జయం రవి, కెన్నీషా కలిసి బహిరంగంగా కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలు ఈవెంట్లు, వివాహ వేడుకలకు జంటగా హాజరయ్యారు. అయితే ఈసారి ఏకంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లడంతో వారిద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పరిణామంపై స్పందించిన ఆర్తి, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "ఇతరులను మోసం చేయొచ్చు. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేవు" అంటూ ఆమె రాసుకొచ్చారు. భర్త తీరును ఉద్దేశించే ఆర్తి ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

గత కొద్ది కాలంగా జయం రవి, కెన్నీషా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో భార్య ఆర్తితో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. తనకు భరణంగా రూ.50 లక్షలు ఇప్పించాలని ఆర్తి కోర్టును కోరారు. తన భర్తతో వివాదాలకు కెన్నీషానే కారణమని ఆమె గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరూ కలిసి పుణ్యక్షేత్రంలో కనిపించడం, దానిపై ఆర్తి ఇలా స్పందించడం గమనార్హం.
Jayam Ravi
Jayam Ravi divorce
Aarthi Ravi
Kennysha Francis
Kollywood actor
Tirumala temple
celebrity news
divorce case
Tamil cinema

More Telugu News