Jagdeep Dhankhar: జగ్ దీప్ ధన్ ఖడ్ ను హౌస్ అరెస్ట్ చేశాని ఆరోపణలు.. అమిత్ షా ఏమన్నారంటే?

Amit Shah dismisses Jagdeep Dhankhar house arrest claims
  • అనారోగ్యం కారణంగా ధన్ ఖడ్ రాజీనామా
  • ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టిపారేసిన కేంద్ర హోంమంత్రి
  • సభలో ప్రధానికి, మంత్రులకు అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారన్న షా
మాజీ ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ధన్ ఖడ్ తో బలవంతంగా రాజీనామా చేయించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులు మరో సంచలన ఆరోపణ చేశారు. ధన్ ఖడ్ ను హౌస్ అరెస్ట్ చేశారని, అందుకే ఆయన బయట కనిపించడంలేదని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకూ ధన్ ఖడ్ బయట ఎక్కడా కనిపించలేదని గుర్తుచేశారు. తాజాగా ఈ ఆరోపణలపై అమిత్ షా స్పందించారు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. జగ్ దీప్ ధన్ ఖడ్ రాజీనామాకు సంబంధించి ప్రతిపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్ ఖడ్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని షా తెలిపారు. రాజ్యసభలో ధన్ ఖడ్ రాజీనామా విషయం వెల్లడించి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర మంత్రులు, సభ్యులు, అధికారులు, సహాయక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారని అమిత్ షా గుర్తుచేశారు. ధన్ ఖడ్ హౌస్ అరెస్ట్ అంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని షా కొట్టిపారేశారు.
Jagdeep Dhankhar
Amit Shah
Vice President resignation
House arrest allegations
BJP
Rajya Sabha
Narendra Modi
Indian Politics

More Telugu News