మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా

  • ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న
  • రేప‌టికి వాయిదా వేసిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌క‌టన‌
  • కాల్ లెట‌ర్ల ప్రక్రియ ఆల‌స్యం కావ‌డంతో స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా 
  • ఈ రోజు ఉద‌యం నుంచి అభ్య‌ర్థుల లాగిన్‌లో కాల్ లెట‌ర్లు
ఏపీ మెగా డీఎస్సీ స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా పడింది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. దీన్ని రేప‌టికి వాయిదా వేసిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్ర‌క‌టించింది. ఇక‌, ఇప్ప‌టికే డీఎస్సీ మెరిట్ జాబితాను పాఠ‌శాల విద్యాశాఖ విడుద‌ల చేసిన‌ విష‌యం తెలిసిందే. డీఎస్సీలో వ‌చ్చిన స్కోర్‌తో పాటు అర్హులైన వారంద‌రికీ ర్యాంకులు కేటాయించారు. రిజ‌ర్వేష‌న్లు, స్థానిక‌త ఆధారంగా ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం కాల్‌లెట‌ర్లు జారీచేయాల్సి ఉంటుంది. 

ఇందులో భాగంగా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు త‌లెత్త‌కుండా అధికారులు ఒక‌టికి రెండుసార్లు జాబితాల‌ను పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఆదివారం అభ్య‌ర్థుల లాగిన్‌కు కాల్ లెట‌ర్లు పంపించి, సోమ‌వారం స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న చేయాల్సి ఉండ‌గా.. కాల్ లెట‌ర్ల ప్రక్రియ ఆల‌స్యం కావ‌డంతో స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో అధికారులు ఈ రోజు ఉద‌యం నుంచి కాల్ లెట‌ర్ల‌ను అభ్య‌ర్థుల లాగిన్‌లో ఉంచ‌నున్నారు.  


More Telugu News