వీడియో కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యూట్యూబర్... వీడియో ఇదిగో!
- ఒడిశాలోని డుడుమా జలపాతం వద్ద ఘటన
- యూట్యూబ్ వీడియో తీసేందుకు నీళ్లలోకి దిగిన యువకుడు
- హఠాత్తుగా పెరిగిన వరదతో నీటిలో చిక్కుకుపోయిన వైనం
- రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలం
- కళ్ల ముందే ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు, మిత్రులు కన్నీరుమున్నీరు
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ ఘోర విషాదం ఒడిశాలో చోటుచేసుకుంది. యూట్యూబ్ ఛానెల్ కోసం ఓ వీడియో చిత్రీకరించాలన్న ఉత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. స్నేహితుల కళ్ల ముందే అతడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఈ హృదయ విదారక ఘటన కొరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే, యూట్యూబర్ సాగర్ తుడు (27) తన స్నేహితులతో కలిసి డుడుమా జలపాతాన్ని సందర్శించాడు. అక్కడి ప్రకృతి అందాలను, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని తన కెమెరాలో బంధించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చేతిలో ఫోన్ పట్టుకుని నెమ్మదిగా నీళ్లలోకి దిగాడు. జలపాతం అందాలను వీడియో తీస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది.
కొద్ది క్షణాల్లోనే ఎగువ నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో సాగర్ అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో నీటి మధ్యలోనే చిక్కుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్నేహితులు అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, వరద తీవ్రత మరింత పెరగడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. చూస్తుండగానే ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే స్నేహితుడు గల్లంతు కావడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.