పుజారాకు విషెస్ తెలిపిన జగన్

  • క్రికెట్ కు వీడ్కోలు పలికిన చటేశ్వర్ పుజారా 
  • పుజారా రిటైర్మెంట్‌పై స్పందించిన వైసీపీ అధినేత జగన్
  • పుజారా క్రమశిక్షణ, ఏకాగ్రత దేశానికి గర్వకారణమన్న మాజీ సీఎం
  • అతడి భవిష్యత్ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్ష
భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు నమ్మకమైన బ్యాటర్‌గా పేరుగాంచిన చటేశ్వర్ పుజారా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. పుజారాకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

చటేశ్వర్ ఇకపైనా విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. క్రికెట్ పట్ల పుజారా చూపిన క్రమశిక్షణ, అంకితభావం దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. "చతేశ్వర్ పుజారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన సందర్భంగా, ఆయన భవిష్యత్ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఆయన క్రమశిక్షణ, ఏకాగ్రత దేశానికి అపారమైన గర్వకారణంగా నిలిచాయి" అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

భారత క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పుజారా రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రీడాభిమానులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


More Telugu News