Shilpa Shetty: తన ఫిట్ నెస్ రహస్యం వెల్లడించిన శిల్పా శెట్టి

Fitness Secrets of Shilpa Shetty at 50 Plus
  • యాభై ఏళ్లు దాటినా యంగ్ గా కనిపించడానికి ఆహారపుటలవాట్లే కారణమట
  • నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు
  • సీజనల్ ఫ్రూట్స్, బాదం పాలలో ఫ్రూట్స్ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్
యాభై ఏళ్లు దాటినా ఇప్పటికీ స్లిమ్ గా, ఆరోగ్యంగా కనిపించడం వెనకున్న రహస్యాన్ని నటి శిల్పాశెట్టి తాజాగా వెల్లడించారు. ఆహారపుటలవాట్లే ప్రధాన కారణమని తెలిపారు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు కానీ తానా తప్పు చేయనని శిల్పా వివరించారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగడంతో తన దినచర్య మొదలవుతుందని తెలిపారు.

ఆ తర్వాత కాసేపటికి నాలుగు చుక్కల నోనీ జ్యూస్ తీసుకుంటానని చెప్పారు. ఆపై టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ తప్పనిసరి అని వివరించారు. బ్రేక్‌ఫాస్ట్ లో సీజనల్ ఫ్రూట్స్, బాదం పాలు, మ్యూజ్లీ,ఉడికించిన గుడ్లు, మధ్యాహ్న భోజనంలో నెయ్యి తప్పనిసరని శిల్పాశెట్టి వివరించారు. అయితే, తాను పాటించే ఆహార అలవాట్లు అందరికీ సరిపడకపోవచ్చని హెచ్చరిస్తూ.. వైద్యుల సలహాతోనే డైట్, ఫిట్‌నెస్ రొటీన్‌ మార్చుకోవాలని సూచించారు.
Shilpa Shetty
Shilpa Shetty fitness
Shilpa Shetty diet
Shilpa Shetty health
fitness secrets
weight loss tips
healthy breakfast
Noni juice
oil pulling
Indian actress

More Telugu News