Ravi Teja: రవి తేజ మాస్ జాతర మూవీ రిలీజ్ వాయిదా .. విడుదల ఎప్పుడంటే..?

Ravi Teja Mass Jathara Movie Release Postponed
  • సెప్టెంబర్‌లో రిలీజ్ ప్లాన్ కూడా డ్రాప్ 
  • షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉండటమే కారణం 
  • దీపావళి కానుకగా విడుదలకు ప్లాన్ చేస్తున్న మేకర్స్
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ‘మాస్ జాతర’ విడుదల మరింత ఆలస్యం కానుంది. తొలుత వినాయక చవితి (ఆగస్ట్ 27) నాడు విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, చిత్రీకరణ పూర్తి కాకపోవడం, కార్మిక సంఘాల బంద్‌ల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్‌కు ఇదివరకే మంచి స్పందన లభించడంతో, రవితేజ మరో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి.

అయితే, తాజా సమాచారం ప్రకారం సినిమా చిత్రీకరణలో మాంటేజ్ సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉంది. సెప్టెంబర్ 12న విడుదల చేస్తారనే ప్రచారం కూడా ఇప్పుడు మారిపోయింది. తాజా నిర్ణయం ప్రకారం, సినిమాను సెప్టెంబర్‌లో కాకుండా అక్టోబర్‌లో దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గత సంవత్సరం దీపావళికే విడుదల చేయాలని మొదట అనుకున్న ఈ చిత్రం, పలు కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తుది ఫలితం ఖచ్చితంగా వచ్చిన తర్వాతే విడుదల తేదీని నిర్ణయించాలనే వ్యూహంతో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ చిత్రం కోసం రవితేజ అభిమానులు మాత్రం దీపావళి వరకు వేచి చూడాల్సి రావచ్చు! మాస్ జాతర ఏ విధంగా అలరించనుందో వేచి చూడాలి. 
Ravi Teja
Mass Jathara
Ravi Teja Mass Jathara
Sreeleela
Bhanu Bogavarapu
Sitara Entertainments
Fortune Four Cinemas
Telugu Movie Release Date
Diwali Release
Mass Maharaja

More Telugu News