Hyderabad: లవ్ మ్యారేజ్.. గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన భర్త
- మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని బాలాజీహిల్స్‌లో ఘటన
- ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హతమార్చిన భర్త
- గర్భవతైన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన వైనం
- స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చిన దారుణం
నగరం ఉలిక్కిపడే ఘటన ఇది. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో గర్భవతైన భార్యను ముక్కలుగా నరికాడో భర్త. వివరాల్లోకి వెళితే.. మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని బాలాజీహిల్స్‌లో నివాసం ఉంటున్నారు.
గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ చంపి ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి.. బయటకు తీసుకెళ్లి పడేయాలని చూశాడు. అయితే, గది నుంచి శబ్ధాలు రావడంతో పొరుగింటి వారు వెళ్లి చూశారు. దీంతో ఈ దారుణ ఘటన బయటపడింది. మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై అతడిని విచారిస్తున్నారు.