Revanth Reddy: 'ఓట్ల చోరీ' లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Unveils Votes Stealing Logo
  • ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు 
  • ఓట్ల చోరీని అడ్డుకుందామని రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఓట్ల చోరీ' లోగోను ఆవిష్కరించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఓట్ల చోరీకి సంబంధించిన ప్రచార లోగోను విడుదల చేశారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీఏసీ సభ్యులతో కలిసి లోగోను విడుదల చేశారు. ఓట్ల చోరీని అడ్డుకుందామని, రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతునిద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Revanth Reddy
Telangana
Votes Stealing
AICC
Mallu Bhatti Vikramarka
Uttam Kumar Reddy

More Telugu News