Chandrababu Naidu: పార్టీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్... 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు వీరే!

Chandrababu Naidu Focuses on Party Strength Observers for 25 Constituencies
  • టీడీపీ పార్లమెంటరీ కమిటీల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం
  • 25 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన అధిష్టానం
  • పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతల అప్పగింత
  • మూడు రోజుల పాటు జరగనున్న సర్వసభ్య సమావేశాలు
ఏపీ అధికార పక్షం టీడీపీ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల ఏర్పాటును పర్యవేక్షించేందుకు పరిశీలకులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ నియామకాలను ఖరారు చేశారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు సీనియర్ నేతలతో కూడిన బృందాన్ని పరిశీలకులుగా నియమించారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు వంటి ప్రముఖ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, పార్టీ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను స్వీకరించి, సమన్వయం చేస్తారు.

ఈ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 24: అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయి.
ఆగస్టు 25: అరకు, కాకినాడ, అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప, హిందూపురం నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 26: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంటు స్థానాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.

ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయం పెంచి, పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

పార్లమెంట్ వారీగా సర్వసభ్య కమిటీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

1. అరకు (ST) – బందెలం అశోక్, బడేటి రాధాకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్

2. శ్రీకాకుళం – వంగలపూడి అనిత, నజీర్ అహ్మద్, కర్రొతు బంగార్రాజు

3. విజయనగరం - మహ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు (గన్నా బాబు), వాసంసెట్టి సుభాష్

4. విశాఖపట్నం – నిమ్మల రామానాయుడు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కుడిపూడి సత్తిబాబు

5. అనకాపల్లి – ఏలూరి సాంబశివరావు, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, డేగల ప్రభాకర్

6. కాకినాడ – కింజరాపు అచ్చెన్నాయుడు, అరిమిల్లి రాధాకృష్ణ, ప్రణవ్ గోపాల్

7. అమలాపురం – కొల్లు రవీంద్ర, జి.వి. అంజనేయులు, గొట్టిముక్కల రఘురామరాజు

8. రాజమండ్రి – పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొలుసు పార్ధసారధి

9. నర్సాపురం – పొంగూరు నారాయణ, నూకసాని బాలాజీ, అనిమిని రవినాయుడు

10. ఏలూరు – గొట్టిపాటి రవి, బుద్దా నాగ జగదీష్, ఎం.ఎస్. రాజు

11. మచిలీపట్నం – కాల్వ శ్రీనివాసులు, దామచర్ల సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ

12. విజయవాడ – పయ్యావుల కేశవ్, బి.టి. నాయుడు, పొలం రెడ్డి దినేష్ రెడ్డి

13. గుంటూరు – ఎన్ఎమ్‌డీ ఫరూక్, మద్దిపాటి వెంకట్రాజు, కిమిడి నాగార్జున

14. నరసరావుపేట – జ్యోతుల నెహ్రూ, కొనకళ్ళ నారాయణ, మందలపు రవి

15. బాపట్ల – పంచుమర్తి అనురాధ, వీరంకి వెంకటగురుమూర్తి, మన్నే సుబ్బారెడ్డి

16. ఒంగోలు – గుమ్మిడి సంధ్యారాణి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాస్

17. నెల్లూరు – ఆనగాని సత్య ప్రసాద్, పులివర్తి వెంకట మణిప్రసాద్, డూండి రాకేష్

18. తిరుపతి – మంతెన రామరాజు, ఎస్. సవిత, బుచ్చి రామ్ ప్రసాద్

19. రాజంపేట – ఆనంరామనారాయణరెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై. నాగేశ్వరరావు యాదవ్

20. చిత్తూరు – బి.సి. జనార్ధనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మణిక్యాలరావు

21. నంద్యాల – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవెలమూడి నాని, పూల నాగరాజు

22. కర్నూలు – నక్కా ఆనందబాబు, బి.కె. పార్ధసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

23. కడప – బీదా రవిచంద్ర, బి.వి. జయనాగేశ్వరరెడ్డి, నాదెండ్ల బ్రహ్మంచౌదరి

24. అనంతపురం – ఎన్. అమర్నాథ్ రెడ్డి, డా. డోలా బాల వీరాంజనేయస్వామి, మద్దిపట్ల సూర్యప్రకాశ్

25. హిందూపురం – దేవినేని ఉమామహేశ్వరరావు, టి.జి. భారత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి

Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
AP Elections
Party Strengthening
Parliament Constituencies
Palla Srinivas
Acham Naidu
Observers Appointed

More Telugu News