Suryapet: సూర్యాపేటలో సినిమా ఫక్కీలో కారులో ఛేజింగ్.. ముగ్గురిపై హత్యాయత్నం!
- సూర్యాపేట జిల్లాలో పట్టపగలే దారుణం
- బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని కారుతో వెంబడించిన దుండగులు
- ప్రాణభయంతో వైన్స్ షాప్‌లోకి పరుగులు తీసిన బాధితులు
- కత్తులు, కర్రలతో హత్య చేసేందుకు దుండగుల యత్నం
- స్థానికులు అడ్డుకోవడంతో పరారైన నిందితులు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం నడిరోడ్డుపై ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో దుండగులు కారులో వెంబడించి, ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిపై హత్యాయత్నం చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధితులు అప్రమత్తంగా వ్యవహరించి, ఒక వైన్స్ షాప్‌లోకి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో, ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక కారులో వారిని వెంబడించడం ప్రారంభించారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో వాహన వేగం పెంచారు. బీబీ గూడెం సమీపానికి రాగానే, దుండగుల నుంచి తప్పించుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న వైన్స్ షాప్ ముందు వాహనం వదిలి, లోపలికి పరుగెత్తారు.
వెంటనే కారులోంచి దిగిన దుండగులు కత్తులు, కర్రలతో వారిపై దాడి చేసేందుకు వైన్స్ షాప్ వైపు దూసుకొచ్చారు. అయితే, షాప్‌లో ఉన్నవారు ఈ హఠాత్పరిణామానికి అప్రమత్తమై ఒక్కసారిగా బయటకు రావడంతో దుండగులు కంగుతిన్నారు. జనం గుమిగూడటాన్ని చూసి భయపడిన ఆ ఐదుగురు వెంటనే వెనుదిరిగి కారులో అక్కడి నుంచి పరారయ్యారు. పట్టపగలే జరిగిన ఈ హత్యాయత్నం స్థానికంగా భయాందోళనలు కలిగించింది.