ఈ నెల 25న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం!!

  • పంచాయతీ ఎన్నికల కోసం సెప్టెంబర్ 30 గడువు విధించిన హైకోర్టు
  • ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఎన్నికలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం
  • రిజర్వేషన్లు రాష్ట్రపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం ఇచ్చే అవకాశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 25న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ శనివారం జరగనున్న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కానుంది. రాష్ట్రపతి వద్ద తేలకపోతే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది.


More Telugu News