Narayana Swamy: ఏపీ లిక్కర్ స్కామ్... మాజీ డిప్యూటీ సీఎంను సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్

Former Deputy CM Narayana Swamy questioned in Liquor Scam Case
  • వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి
  • పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్ విచారణ
  • సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానన్న మాజీ డిప్యూటీ సీఎం
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత నారాయణస్వామిని సిట్ విచారించింది. చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఆయన నివాసంలో సుమారు ఆరు గంటల పాటు సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి పనిచేసిన నేపథ్యంలో, అప్పటి మద్యం విధానంలో చేపట్టిన మార్పులపై అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న కారణాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సుదీర్ఘ విచారణ అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు.

సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను పూర్తి సమాధానాలు ఇచ్చానని ఆయన తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా సంపూర్ణంగా సహకరిస్తానని అధికారులకు స్పష్టం చేసినట్లు చెప్పారు. "సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను. మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసు ఇచ్చారు" అని నారాయణస్వామి పేర్కొన్నారు.
Narayana Swamy
AP Liquor Scam
Andhra Pradesh Liquor
YSRCP
Excise Department
SIT Investigation
Chittoor
Liquor Policy

More Telugu News