Sara Tendulkar: కుమార్తె సారా 'పైలేట్స్ అకాడమీ' ప్రారంభించడంపై సచిన్ టెండూల్కర్ స్పందన
- కొత్తగా పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా టెండూల్కర్
- కూతురి విజయంపై సోషల్ మీడియాలో సచిన్ భావోద్వేగ పోస్ట్
- తన సొంత కష్టం, నమ్మకంతోనే సారా ఈ స్థాయికి చేరిందని వెల్లడి
- తమ కుటుంబ ఆరోగ్య విలువలను సారా ముందుకు తీసుకెళ్తోందని హర్షం
- కుమార్తెను చూసి గర్వంగా ఉందని మనసులోని మాట చెప్పిన సచిన్
- సారా కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ బ్లాస్టర్
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒక తండ్రిగా గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు. తన కుమార్తె సారా టెండూల్కర్ తాజాగా ఒక కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడమే ఇందుకు కారణం. సారా ముంబైలో సొంతంగా ఒక పైలేట్స్ స్టూడియోను ప్రారంభించారు. దీని పేరు పైలేట్స్ అకాడమీ. ఈ సందర్భంగా తన కుమార్తెను అభినందిస్తూ సచిన్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నాడు.
"పిల్లలు తమకు అత్యంత ఇష్టమైన పనిని కనుగొన్నప్పుడు తల్లిదండ్రులకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. సారా ఒక పైలేట్స్ స్టూడియో ఓపెన్ చేయడం చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి" అని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. సారా తన సొంత కష్టం, నమ్మకంతో అంచెలంచెలుగా ఈ ప్రస్థానానికి బాటలు వేసుకుందని ఆయన ప్రశంసించారు.
తమ కుటుంబంలో ఆరోగ్యం, వ్యాయామానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని సచిన్ గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఆలోచనను సారా తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలిపారు. "సారా, నిన్ను చూసి మేం ఎంతో గర్వపడుతున్నాం. నువ్వు ప్రారంభించబోతున్న ఈ కొత్త ప్రయాణానికి మా శుభాకాంక్షలు" అంటూ ఆయన తన కూతురిని మనసారా ఆశీర్వదించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, అభిమానులు సారాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.