మా హీరోకు హ్యాపీ బర్త్ డే: సుస్మిత కొణిదెల
- నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు
- మెగా ఇంట సందడి... సంబరాలు
- విషెస్ తెలిసిన పెద్ద కుమార్తె సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన తండ్రిని తన హీరోగా అభివర్ణిస్తూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని, వృత్తిపరమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తండ్రితో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.
"మా హీరో, మా నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు మీ గారాల పట్టిగా ఉన్న నేను, ఇప్పుడు నిర్మాతగా మీతో కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను" అని సుస్మిత తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తండ్రి నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెబుతూ, "మీరు నేర్పిన ప్రతి పాఠానికి, పంచిన ప్రతి నవ్వుకు, ఇచ్చిన ప్రతి ఆలింగనానికి ధన్యవాదాలు డాడ్. లవ్ యూ ఫరెవర్" అని తన ప్రేమను వ్యక్తపరిచారు.
ఈ పోస్ట్‌కు మరింత ప్రత్యేకతను జోడిస్తూ, చివరగా చిరంజీవి కొత్త సినిమా పేరును ఆమె ప్రస్తావించారు. "మన శంకర వరప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ముగించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి 157వ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంతో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి సుస్మత కొణిదెల నిర్మాత అని తెలిసిందే.