Chiranjeevi: గోవాలో చిరు 70వ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌.. ఎమోష‌న‌ల్ వీడియో షేర్ చేసిన చ‌రణ్‌

Chiranjeevi 70th Birthday Celebrations in Goa Charan Shares Emotional Video
  • నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన‌రోజు
  • కుటుంబంతో కలిసి గోవాలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్న చిరు
  • ఈ వేడుక‌ల తాలూకు వీడియోను అభిమానుల‌తో పంచుకున్న చెర్రీ
నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు.  ఈ వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. ఇక, చిరుకు అభిమానులు, సినీ, రాజకీయ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోషల్ మీడియా వేదికగా జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 

ఈ సందర్భంగా చిరు త‌న‌యుడు రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపిస్తూ, చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవ‌డం చూడొచ్చు. 

ఆ తర్వాత ఇద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. చిరు కూడా చెర్రీకు కేక్ తినిపిస్తూ కుమారుడిపై త‌న‌కున్న ప్రేమ‌ని తెలియ‌జేశారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ వీడియోను పెద్దఎత్తున షేర్ చేస్తూ,  మెగాస్టార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. 
Chiranjeevi
Chiranjeevi birthday
Ram Charan
Mega Star
Goa celebrations
Chiranjeevi 70th birthday
Tollywood
Mega family

More Telugu News