US Truck Driver Visa Ban: భారత డ్రైవర్ యాక్సిడెంట్ ఎఫెక్ట్.. అమెరికాలో ట్రక్ డ్రైవర్ల వీసాలపై నిషేధం

US Stops Issuing Visas To Foreign Truck Drivers After Fatal Florida Crash
  • అమెరికాలో విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసాల జారీ తక్షణం నిలిపివేత
  • ఫ్లోరిడాలో భారత డ్రైవర్ వల్ల జరిగిన ప్రమాదంలో ముగ్గురి మృతి
  • విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు అధికారిక ప్రకటన
  • ఘటనపై రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం
  • అమెరికన్ల భద్రత, ఉద్యోగాల కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం వెల్లడి
అమెరికాలో ఓ భారత సంతతి ట్రక్ డ్రైవర్ చేసిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, విదేశాల నుంచి వచ్చే వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే వర్క్ వీసాల జారీని తక్షణమే నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అమెరికన్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, స్థానిక డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొంటూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. "విదేశీ వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే అన్ని వర్కర్ వీసాల జారీని తక్షణమే నిలిపివేస్తున్నాం. అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల ఫ్లోరిడాలోని ఓ హైవేపై హర్జిందర్ సింగ్ అనే భారత డ్రైవర్ అక్రమంగా యూ-టర్న్ తీసుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్, ప్రమాదం తర్వాత నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలో కూడా విఫలమయ్యాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా మీడియాలో హైలైట్ అయింది.

ఈ ప్రమాదం ఇప్పుడు అమెరికాలో రాజకీయ దుమారానికి కారణమైంది. నిందితుడు సింగ్ డెమొక్రాట్లు అధికారంలో ఉన్న కాలిఫోర్నియాలో నివసిస్తూ అక్కడే కమర్షియల్ లైసెన్స్ పొందాడు. దీంతో ట్రంప్ ప్రభుత్వం, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్‌పై తీవ్ర విమర్శలు చేసింది. అయితే, సింగ్‌కు వర్క్ పర్మిట్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వమేనని, అతడిని అప్పగించే విషయంలో తాము పూర్తిగా సహకరించామని న్యూసమ్ కార్యాలయం బదులిచ్చింది.
US Truck Driver Visa Ban
Harjinder Singh
truck accident Florida
Marco Rubio
US work visa
Donald Trump
Gavin Newsom
California commercial license
US trucking industry

More Telugu News