Reliance Jio: రూ.799 రీఛార్జి రద్దయిందా.. రిలయన్స్ జియో క్లారిటీ

Reliance Jio Denies Cancellation of Rs 799 Recharge Plan
--
రిలయన్స్ జియో రీఛార్జి ప్లాన్ విషయంలో నెలకొన్న గందరగోళంపై ఆ కంపెనీ స్పందించింది. రూ.799 రీఛార్జి ప్లాన్ ను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీఛార్జి చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్‌ తో అందుబాటులోనే ఉంచినట్లు వివరణ ఇచ్చింది.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా, అందుబాటు ధరలో రీఛార్జి ప్లాన్లను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు జియో పేర్కొంది. రూ.799 రీఛార్జి ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చని, రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్ లో రోజుకు వంద ఎస్ఎంఎస్ లు పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
Reliance Jio
Jio recharge plan
Jio 799 plan
Jio validity
Jio data plan
Jio unlimited calls
Jio SMS
Jio recharge offers
Jio plans 2024
Jio latest news

More Telugu News