Perambam Perungobamam: ఓటీటీలో ఉత్కంఠను రేకెత్తించే తమిళ థ్రిల్లర్!

Peranbum Perungobamum Movie Update
  • తమిళంలో రూపొందిన సినిమా 
  • రివేంజ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ 
  • ఈ నెల 22వ నుంచి అందుబాటులోకి

 ప్రేమ కథలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి. కులమతాలు వేరైనప్పుడే ప్రేమకథల్లో యుద్ధాలు చోటుచేసుకుంటాయి. అవి పరువు హత్యల వరకూ వెళతాయి. అలా పరువు హత్యల కారణంగా బాధలు పడిన ఒక యువతి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకి సమాధానంగా రూపొందిన సినిమానే 'పెరంబం పెరుంగోబమమ్'. అంటే 'గొప్ప ప్రేమ - గొప్ప కోపం' అనే అర్థం వస్తుంది. 

శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. విజిత్ బచన్ .. షాలీ నివేకస్ .. అరుళ్ దాస్ .. మైమ్ గోపీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ  ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ కానుంది. 

ఒక యువకుడు - యువతి ప్రేమించుకుంటారు. అయితే వారి ప్రేమకు కులం అడ్డుగోడగా నిలుస్తుంది. వాళ్లిద్దరినీ విడదీయడానికి ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తారు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ యువతి ఏం చేసింది? పర్యవసానంగా ఏం జరిగింది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశమైతే ఉంది. 

Perambam Perungobamam
Tamil thriller
OTT movies
Aha Tamil
revenge drama
caste based violence
Shali Nivekas
Vijith Bachan
Arul Dass

More Telugu News