Ramakrishna Rao: తెలంగాణ రాష్ట్ర సీఎస్ కార్యాలయానికి అనుకోని 'అరుదైన' అతిథి!

Unexpected Guest at Telangana CS Ramakrishna Rao Office
  • సీఎస్ రామకృష్ణరావు కార్యాలయంలో ప్రత్యక్షమైన అరుదైన చిలుక
  • డెస్క్‌పై వాలిన చిలుకను విశ్రాంతి తీసుకోనిచ్చిన సిబ్బంది
  • అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన సిబ్బంది
  • ఆఫ్రికన్ గ్రే చిలుకగా గుర్తించిన అటవీ శాఖ అధికారులు
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అనుకోని 'అరుదైన' అతిథి విచ్చేశారు! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కార్యాలయంలో అరుదైన జాతికి చెందిన చిలుక ఒకటి ప్రత్యక్షమైంది. ఆయన ఛాంబర్‌‍లోకి ఒక్కసారిగా ప్రవేశించిన ఆ చిలుక నేరుగా ఒక డెస్క్‌పై వాలింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వచ్చిన ఆ అరుదైన చిలుకకు సిబ్బంది కొంతసేపు విశ్రాంతినిచ్చారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ సిబ్బంది సచివాలయానికి చేరుకుని, అది ఆఫ్రికన్ గ్రే చిలుక అని నిర్ధారించారు. ఆ పక్షిని వారు తమ వెంట తీసుకువెళ్లారు.
Ramakrishna Rao
Telangana CS
Telangana Secretariat
African Grey Parrot
Forest Department

More Telugu News