Nara Lokesh: మంత్రి లోకేశ్‌ చొరవతో ఏపీకి కేంద్రం అధిక ప్రాధాన్యం

Nara Lokesh Secures Central Funding Boost for AP Education
  • ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కృషికి కేంద్రం మద్దతు
  • సమగ్రశిక్షకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధుల మంజూరు
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నేతృత్వంలో దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్ది ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అందరూ మాట్లాడుకునే విధంగా చేస్తామనే మంత్రి లోకేశ్‌ సంకల్పానికి కేంద్రం కూడా మద్దతుగా నిలుస్తోంది. సమగ్రశిక్ష ప్రాజక్టుకు గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. దేశానికే ఏపీ విద్యాశాఖ దిక్సూచిగా మారాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష వినూత్నమైన కార్యక్రమాలతో, విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తోంది. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్షకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి లోకేశ్‌ చొరవతో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. మంత్రి లోకేశ్ కృషి కారణంగా సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖకు వరుసగా కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు మంజూరయ్యాయి. 

ఐసీటీ ల్యాబ్ లు, స్మార్ట్ క్లాసెస్ కు రూ.167.46 కోట్ల అదనపు నిధులు మంజూరు
సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులను బలోపేతం చేయడానికి ఐసీటీ (Information and Communication Technology) ల్యాబ్ లు, స్మార్ట్ తరగతులు, సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.167.46 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. దీంతో పాటు డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చడానికి గతంలో 50 శాతం మాత్రమే నిధులు రాగా, ఈ ఏడాది రూ. 45 కోట్లకు గానూ 96 శాతం అంటే రూ. 43.23 కోట్ల నిధులు మంజూరు చేసింది. దశల వారీగా ఇతర డైట్ కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేందుకు తగిన నిధులు మంజూరు చేయనుంది.

ఆదివాసీ విద్యార్థులకు వసతి గృహాల కోసం రూ.11 కోట్లు మంజూరు
ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) పథకంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ విద్యార్థుల కోసం 4 వసతి గృహాలను నిర్మించేందుకు కేంద్రం రూ.11 కోట్లు నిధులు మంజూరు చేసింది. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం అనేది గిరిజన తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. 2024-25 నుంచి 2028-29 వరకు ఐదేళ్ల కాలానికి ఈ పథకం అమలు చేయనున్నారు. గిరిజన మెజారిటీ గ్రామాలన్నింటిలోనూ సంపూర్ణ అభివృద్ధిని సాధించడం, వారికి మెరుగైన మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం.

జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద రూ.210.5 కోట్లు మంజూరు
ప్రధాన మంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం (PMJANMAN) లో భాగంగా రెండు దశల్లో మొత్తం 79 హాస్టళ్లు నిర్మించేందుకు కేంద్రం రూ.210.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత ఏడాది నాలుగు హాస్టళ్లు మాత్రమే మంజూరు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 79 హాస్టళ్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ మేరకు నిధులు కేటాయించింది. 

మంత్రి లోకేశ్‌ చొరవతో పీఎంశ్రీ కింద అదనంగా 80 పాఠశాలలు ఎంపిక
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PMSHIRI) పథక కింద రాష్ట్రంలో ఈ ఏడాదికి మొత్తం 80 పాఠశాలలను కేంద్రం ఎంపిక చేసింది. వీటికి ఇంకా నిధులు కేటాయించాల్సి ఉంది. రాష్ట్రంలో మొదటి దశలో 662 పీఎంశ్రీ పాఠశాలలు, రెండో దశలో 193 కలిపి మొత్తం 855 పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేయగా.. మంత్రి నారా లోకేశ్‌ చొరవతో ఈ విద్యా సంవత్సరం అదనంగా మరో 80 పీఎంశ్రీ పాఠశాలలను రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 14,500 పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా.. అత్యధికంగా ఏపీకే 935 పీఎంశ్రీ పాఠశాలలను కేటాయించడం జరిగింది. మొత్తం మీద మంత్రి లోకేశ్‌ కృషి కారణంగా సమగ్రశిక్ష కింద రాష్ట్రానికి అదనంగా రూ.432.19 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
Nara Lokesh
AP Education
Andhra Pradesh Education
Central Funds
PM Shri Schools
Samagra Shiksha
ICT Labs
Tribal Students Hostels
AP Model Education
Education Funding

More Telugu News