AP DSC 2025: వెబ్ సైట్‌లో ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్ట్

AP DSC 2025 Merit List Released on Website
  • డీఎస్సీ 2025 నియామకాలకు కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
  • రోస్టర్ పాయింట్స్‌కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్ధులకు సమాచారం
  • రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
డీఎస్సీ 2025 నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లోకి విడుదల చేసింది. నేడు ఎంపిక జాబితాను సిద్ధం చేసి, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించనున్నారు. అభ్యర్థుల మొబైల్ ఫోన్‌లకు నేరుగా సమాచారం ఇవ్వనున్నారు.

రేపటి నుంచి (ఆగస్టు 21) ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించిన విషయం తెలిసిందే. 
AP DSC 2025
DSC 2025
AP DSC Merit List
AP Teacher Recruitment
Teacher Recruitment 2025
AP Government Jobs
School Education AP
AP Education Department
Merit List
Andhra Pradesh

More Telugu News