Apple: ఆపిల్ కీలక నిర్ణయం... అమెరికా కోసం ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లన్నీ భారత్ లోనే తయారీ
- అమెరికా కోసం ఐఫోన్ 17 సిరీస్‌ను భారత్‌లో తయారు చేయనున్న ఆపిల్
- ప్రో మోడళ్లతో సహా మొత్తం సిరీస్ ఇక్కడే తయారీ
- చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యం
- టాటా, ఫాక్స్‌కాన్ ప్లాంట్లలో భారీగా ఉత్పత్తి పెంపు
- ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన ఐఫోన్ ఎగుమతులు
- సెప్టెంబరు మొదటి వారంలో ఐఫోన్ 17 విడుదల
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన తయారీ వ్యూహంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా మార్కెట్ కోసం తన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొన్ని మోడళ్లను మాత్రమే భారత్‌లో అసెంబుల్ చేసిన ఆపిల్, తొలిసారిగా ప్రో మోడళ్లతో సహా మొత్తం సిరీస్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా చైనాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆపిల్ తీసుకున్న ఈ వ్యూహాత్మక మార్పులో టాటా గ్రూప్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ కీలక పాత్ర పోషించనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే రెండేళ్లలో ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో సగం వాటా భారతదేశానిదే కానుంది. ఇందుకోసం తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టాటా ప్లాంట్‌తో పాటు, బెంగళూరు విమానాశ్రయం సమీపంలోని ఫాక్స్‌కాన్ ఉత్పత్తి కేంద్రాన్ని భారీగా విస్తరించనున్నారు. ఈ కొత్త సిరీస్ 2025 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల కానుంది.
భారత్‌లో ఉత్పత్తిని పెంచాలన్న ఆపిల్ నిర్ణయం ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి కేవలం నాలుగు నెలల్లోనే భారతదేశం నుంచి ఐఫోన్ ఎగుమతుల విలువ 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఎగుమతులైన 17 బిలియన్ డాలర్లలో దాదాపు సగం కావడం విశేషం.
టారిఫ్‌ల రూపంలో 1.1 బిలియన్ డాలర్ల భారం పడవచ్చని ఆపిల్ అంచనా వేస్తున్నప్పటికీ, సరఫరా గొలుసును వైవిధ్యభరితం చేయడమే ముఖ్యమని భావిస్తోంది. ఈ నిర్ణయంతో భారతదేశంలో ఆపిల్ తయారీ సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మన దేశ ఖ్యాతి మరింత బలపడనుంది.