CRPF: సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి హై అలర్ట్... ఆ ఫేక్ యాప్‌తో మహా డేంజర్!
- 'సంభవ్ అప్లికేషన్ రైటర్' అనే నకిలీ యాప్‌పై సీఆర్‌పీఎఫ్ హెచ్చరిక
- వాట్సాప్, యూట్యూబ్ ద్వారా ఈ ఫేక్ యాప్ ప్రచారం
- సిబ్బంది వ్యక్తిగత, సంస్థాగత వివరాలు సేకరించడమే లక్ష్యం
- అసలు యాప్ పేరు 'సీఆర్‌పీఎఫ్ సంభవ్' అని వెల్లడి
- ప్లే స్టోర్ల నుంచి యాప్‌ను తొలగించాలని సైబర్ ఏజెన్సీలకు విజ్ఞప్తి
- ప్రతి జవాన్‌ను అప్రమత్తం చేయాలని యూనిట్లకు కఠిన ఆదేశాలు
దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), తమ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న ఒక ప్రమాదకరమైన నకిలీ మొబైల్ యాప్ పట్ల హెచ్చరికలు జారీ చేసింది. తమ అధికారిక ప్లాట్‌ఫామ్‌ను అనుకరిస్తూ రూపొందించిన 'సంభవ్ అప్లికేషన్ రైటర్' అనే యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని అప్రమత్తం చేసింది. ఈ యాప్ ద్వారా జవాన్ల కీలక వ్యక్తిగత, సంస్థాగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని సీఆర్పీఎఫ్ ఐటీ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ నకిలీ యాప్‌ను విపరీతంగా ప్రచారం చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ గుర్తించింది. సిబ్బంది వినియోగించే అధికారిక 'సీఆర్‌పీఎఫ్ సంభవ్' యాప్‌లోకి అప్లికేషన్లు సిద్ధం చేసేందుకు సాయపడతామని ఈ ఫేక్ యాప్ మోసపూరితంగా నమ్మిస్తోంది. ఇందుకోసం సిబ్బంది ఫోర్స్ ఐడీ, యూనిట్ పేరు వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత, విధి సంబంధిత వివరాలను పంచుకోవాలని కోరుతోంది.
ఈ సమాచారాన్ని అనధికారిక యాప్‌తో పంచుకోవడం వల్ల తీవ్రమైన ఆపరేషనల్ భద్రతాపరమైన ముప్పు వాటిల్లుతుందని సీఆర్పీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం చేయవద్దు" అని తన హెచ్చరికలో కఠినంగా ఆదేశించింది. సిబ్బంది తమ జీతభత్యాలు, సెలవులు, బదిలీల అర్హత వంటి వివరాలను చూసుకునేందుకు అసలైన 'సీఆర్పీఎఫ్ సంభవ్' యాప్‌ను వినియోగిస్తుంటారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సీఆర్పీఎఫ్, ఈ అనధికారిక యాప్‌ను ఆన్‌లైన్ ప్లే స్టోర్ల నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వ సైబర్ భద్రతా ఏజెన్సీలను కోరినట్లు ఒక అధికారి తెలిపారు. అంతేకాకుండా, తమ పరిధిలోని అన్ని యూనిట్ల కమాండర్లు ఉదయం, సాయంత్రం జరిగే రోల్ కాల్స్‌లో ప్రతి జవాన్‌కు ఈ నకిలీ యాప్ గురించి తెలియజేసి, అప్రమత్తంగా ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నక్సల్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పనిచేసే సీఆర్‌పీఎఫ్ సిబ్బంది డేటా చోరీకి గురైతే దేశ భద్రతకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.