Aishwarya Rai: సోషల్ మీడియాపై ఐశ్వర్య రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Aishwarya Rais Interesting Comments on Social Media
  • సోషల్ మీడియా వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన ఐశ్వర్య రాయ్
  • లైకులు, కామెంట్లు మన విలువను నిర్ణయించవని స్పష్టీకరణ
  • గుర్తింపు కోసం సామాజిక మాధ్యమాలపై ఆధారపడొద్దని హితవు
  • ఒక తల్లిగా ఈ ధోరణిపై ఆందోళన చెందుతున్నానని వెల్లడి
  • వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలవుతున్నారని ఆవేదన
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ సోషల్ మీడియా వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంలో సామాజిక మాధ్యమాల ప్రభావం మితిమీరిపోతోందని, గుర్తింపు కోసం దానిపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలు ఆత్మవిశ్వాసం కోసం సోషల్ మీడియా వైపు చూడటం తనను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ, "సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు, షేర్ల ఆధారంగా మన విలువను అంచనా వేసుకోకూడదు. నిజమైన గుర్తింపు మనలోనే ఉంటుంది తప్ప, ఆన్‌లైన్ వేదికల్లో వెతికితే దొరకదు. సామాజిక మాధ్యమాలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి రెండూ ఒకటే. ఆత్మగౌరవం కోసం అక్కడ వెతకడం వృథా ప్రయాస" అని స్పష్టం చేశారు.

ఒక తల్లిగా ఈ ధోరణి తనను తీవ్రంగా కలవరపెడుతోందని ఐశ్వర్య తన ఆవేదనను పంచుకున్నారు. "ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఈ వ్యసనం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని ఆమె పేర్కొన్నారు. ఐశ్వర్య చేసిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Aishwarya Rai
Aishwarya Rai social media
social media impact
Aishwarya Rai comments
social media addiction
online identity
self-esteem
social media pressure

More Telugu News