Marisan: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తమిళ థ్రిల్లర్!

Maareesan Movie Update
  • తమిళంలో రూపొందిన 'మారీశన్'
  • కామెడీ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్ 
  • ప్రధాన పాత్రలో ఫహాద్ ఫాజిల్ - వడివేలు
  • జులైలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 22వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్

ఏ కథ అయినా మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులు జారిపోకుండా పట్టుకోవాలి. ఏ క్షణంలో ఏ జరుగుతుందనేది ప్రేక్షకులు అంచనా వేయలేనిదై ఉండాలి. అడుగడుగునా ఆసక్తిని రేకెత్తిస్తూనే, కావలసినంత వినోదాన్ని పంచాలి. అలాంటి కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. విజయాలను ముట్టజెబుతూనే ఉంటారు. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన తమిళ సినిమానే 'మారీశన్'. 

ఫహాద్ ఫాజిల్ .. వడివేలు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సుధీశ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఆర్ బి చౌదరి నిర్మించిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 22 వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' ద్వారా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
  
కథ విషయానికి వస్తే .. దయాళన్(ఫహాద్ ఫాజిల్) ఓ దొంగ. అతని దృష్టి వేలాయుధం (వడివేలు)పై పడుతుంది. ఎందుకంటే వేలాయుధం బాగా డబ్బున్నవాడు. అయితే అతను అల్జీమర్స్ తో బాధపడుతూ ఉంటాడు. ఒక రోజున అతను ఒంటరిగా తన ఫ్రెండ్ ఊరుకి బయల్దేరతాడు. దయాళన్ అతని డబ్బు కాజేయాలనే ఉద్దేశంతో, తన బైక్ పై అతను వచ్చేలా చేస్తాడు. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందనేది కథ. ఇతర ముఖ్యమైన పాత్రలలో కోవై సరళ ..  వివేక్ ప్రసన్న .. సితార .. రేణుక కనిపించనున్నారు.
Marisan
Marisan movie
Fahadh Faasil
Vadivelu
Tamil thriller movie
Netflix streaming
Yuvan Shankar Raja
OTT platform
Tamil cinema

More Telugu News