Nara Lokesh: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ను కలిసిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Meets NDA Vice President Candidate CP Radhakrishnan
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
  • క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారన్న లోకేశ్
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను నిన్న రాత్రి మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.

మంత్రి లోకేశ్ వెంట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలను నారా లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 
Nara Lokesh
CP Radhakrishnan
Andhra Pradesh
AP Minister
NDA Vice President candidate
Delhi visit
K Rammohan Naidu
Pemmasani Chandrasekhar
Telugu Desam Party
TDP

More Telugu News