Jagan Mohan Reddy: జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్... మద్దతిస్తారా?

Rajnath Singh calls Jagan for support in Vice President Election
  • ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి
  • ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న రాధాకృష్ణన్
  • బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేపథ్యంలో జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
జాతీయ రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని ఆయన జగన్‌ను కోరారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై జగన్ పరోక్ష విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఫోన్ కాల్‌కు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో, ఎన్డీఏ తమ అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వివిధ పార్టీల మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలోనే రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా జగన్‌తో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీలతో కూటమిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులతో కలిసి ఉన్న బీజేపీకి జగన్ మద్దతు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Jagan Mohan Reddy
Rajnath Singh
Vice President Election
Radhakrishnan
NDA
YSRCP
Andhra Pradesh Politics
BJP Alliance
TDP
Janasena

More Telugu News