Devineni Uma: దమ్ముంటే అమరావతిలో పర్యటించాలి: జగన్ కు దేవినేని ఉమా సవాల్

Devineni Uma Challenges Jagan to Visit Amaravati
  • అమరావతి వచ్చి అభివృద్ధి చూడాలంటూ జగన్‌కు ఉమ సవాల్
  • కుంభకోణాల వారి కోసం జైలు యాత్రలు మానాలని హితవు
  • అమరావతి మునగలేదని నిరూపిస్తామన్న దేవినేని
  • ఉచిత బస్సు పథకంపై ఈర్ష్యతోనే జగన్ విమర్శలు అని ఆరోపణ
  • రాజధానిపై వైసీపీది దుష్ప్రచారం అంటూ తీవ్ర విమర్శలు
వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. దమ్ముంటే అమరావతిలో పర్యటించాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని అన్నారు. సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు.

కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు చేయడం మానుకుని, రాజధాని పర్యటనకు రావాలని జగన్‌ను ఉద్దేశించి దేవినేని వ్యాఖ్యానించారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు, సచివాలయం, విట్, ఎస్ఆర్‌ఎం వంటి ప్రాంతాలకు జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాము వస్తామని చెప్పారు. అమరావతి ఎక్కడా మునిగిపోలేదని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే జగన్, అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని, అమరావతి అభివృద్ధిని సహించలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Devineni Uma
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh
TDP
YSRCP
AP Politics
Seed Access Road
Free Bus Travel Scheme
AP Development

More Telugu News