ChatGPT: ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన స్పానిష్ జంట.. చాట్ జీపీటీ తప్పుదోవ పట్టించిన వైనం!

Spanish Couple Misses Flight Due to ChatGPTs Wrong Advice
  • ఇటీవల పలుమార్లు చాట్ జీపీటీని తిట్టిన యువతి
  • బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫ్యూర్టోరికా పర్యటనకు ఏర్పాట్లు
  • వీసా అవసరం లేదని యువతిని తప్పుదోవ పట్టించిన చాట్ జీపీటీ
  • వీసా లేదని విమానం ఎక్కకుండా ఆపేసిన అధికారులు
చాట్ జీపీటీ సలహా నమ్మి స్పెయిన్ కు చెందిన ఓ జంట ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయారు. టికెట్లు బుక్ చేసుకున్నా విమానం ఎక్కలేకపోయారు. ఇదంతా చాట్ జీపీటీ ఇచ్చిన తప్పుడు సలహా వల్లే జరిగిందని, గతంలో తాను తిట్టినందుకు చాట్ జీపీటీ ఇలా ప్రతీకారం తీర్చుకున్నట్లుందని సదరు యువతి వాపోయింది.

అసలేం జరిగిందంటే..
స్పెయిన్ కు చెందిన మెర్రీ కాల్డాస్ ఆమె బాయ్ ఫ్రెండ్ అల్జాండ్రో సిడ్ ఇటీవల ప్యూర్టోరికోలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ వీసా అవసరమా? లేదా? అనేది తెలుసుకోవడానికి చాట్ జీపీటీని అడిగారు. వీసా అవసరం లేదని సలహా ఇచ్చిన చాట్ జీపీటీ.. ఎలక్ట్రానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈఎస్టీఏ) తప్పనిసరి అని హెచ్చరించలేదు. దీంతో ఆ జంట ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయం చేరుకున్నారు. తీరా విమానం ఎక్కే ముందు అధికారులు వారిని అడ్డుకున్నారు. ప్యూర్టోరికాకు వీసా అవసరం లేదనేది నిజమే అయినప్పటికీ, ఈఎస్టీఏ మాత్రం తప్పనిసరి అని, అది లేకపోవడంతో విమానంలోకి అనుమతించలేమని చెప్పారు.

ఇక జన్మలో నమ్మను..
ఈ ఘటనపై మెర్రీ కాల్డాస్ కన్నీటిపర్యంతమయ్యారు. చాట్ జీపీటీని గతంలో తాను తీవ్రంగా అవమానించానని, చాలాసార్లు తిట్టానని గుర్తుచేసుకున్నారు. దానికి ప్రతీకారంగానే చాట్ జీపీటీ ఈ పనిచేసిందని వాపోయారు. ఇకపై చాట్ జీపీటీని తన జన్మలో నమ్మబోనని ఆమె తేల్చిచెప్పారు.
ChatGPT
Merry Caldas
Spain
Puerto Rico
ESTA
Travel authorization
AI
Artificial intelligence
Visa requirements
Travel advice

More Telugu News