Darshan: ఇక నుంచి నా భర్త సోషల్ మీడియా ఖాతాలు నేను నడిపిస్తా: హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి

Vijayalakshmi to Manage Darshans Social Media Accounts
  • అభిమాని హత్య కేసులో జైలుకు వెళ్లిన హీరో దర్శన్
  • భర్తకు అండగా విజయలక్ష్మి.. సోషల్ మీడియా బాధ్యతలు స్వీకరణ
  • నా భర్త త్వరలోనే తిరిగి వస్తాడంటూ అభిమానులకు సందేశం
కన్నడ నటుడు, 'ఛాలెంజింగ్ స్టార్' దర్శన్ సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతలను ఆయన భార్య విజయలక్ష్మి స్వీకరించారు. ఇకపై దర్శన్ తరఫున తానే ఆయన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తానని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి ఆమె ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.

దర్శన్ తిరిగి వచ్చి నేరుగా అభిమానులతో మాట్లాడేంత వరకు, ఆయన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సినిమా అప్డేట్స్, ఇతర ప్రమోషన్ల వివరాలను తానే పంచుకుంటానని విజయలక్ష్మి తెలిపారు. "మీ ఛాలెంజింగ్ స్టార్ మీలో ప్రతి ఒక్కరినీ తన హృదయంలో దాచుకున్నారు" అని ఆమె పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో అభిమానులు చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న ప్రార్థనలు, వారి సహనం తమ కుటుంబానికి అపారమైన శక్తిని ఇస్తున్నాయని ఆమె అన్నారు.

అభిమానులంతా ఐక్యంగా, సానుకూల దృక్పథంతో ఉండాలని విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. దర్శన్ త్వరలోనే తిరిగి వస్తారని, మునుపటిలాగే అదే ప్రేమ, ఉత్సాహంతో అందరినీ పలకరిస్తారని ఆమె భరోసా ఇచ్చారు. అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ విజయలక్ష్మి తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శన్ చాన్నాళ్లుగా నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉండడంతో భరించలేక... రేణుకాస్వామి అనే అభిమాని పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపడంతో ఆ అభిమానిని దర్శన్ బృందం కిరాతకంగా హతమార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇటీవలే సుప్రీం కోర్టు బెయిల్ రద్దు చేయడంతో దర్శన్, పవిత్ర  గౌడ మళ్లీ జైలుకు వెళ్లారు. 
Darshan
Darshan Thoogudeepa
Vijayalakshmi Darshan
Kannada actor
Pavitra Gowda
Renukaswamy murder case
Kannada film industry
Social media management

More Telugu News