Nara Lokesh: నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకలో మంత్రి లోకేశ్

Nara Lokesh at Nimmala Ramanayudu Daughter Engagement Ceremony
  • కాబోయే దంపతులను ఆశీర్వదించిన మంత్రి
  • పాలకొల్లులో మంత్రికి గజమాలతో ఘన స్వాగతం
  • మంత్రి నారా లోకేశ్ ను సత్కరించిన రామానాయుడు
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ, పవన్ లను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు చేరుకున్న మంత్రి నారా లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు.

మంత్రి నారా లోకేశ్ ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామాంజనేయ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



Nara Lokesh
Nimmala Ramanayudu
Andhra Pradesh
Lokesh Nara
West Godavari
Engagement Ceremony
Palkollu
Telugu Desam Party
Anagani Satya Prasad
Chintakayala Ayyanna Patrudu

More Telugu News