తెలంగాణలో భారీ వర్షాలు.. అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్
- సహాయక చర్యలకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ఈఎన్‌సీ కార్యాలయంలో ప్రత్యేక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు
రహదారుల్లో ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా 040 - 35174352 టోల్ ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఉన్న కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలు కూడా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా వెంటనే సంబంధిత నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.