అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమే: జగన్
- ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన జగన్
- ధర్మం నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతమని వ్యాఖ్య
- శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనమని ట్వీట్
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా అది తాత్కాలికమని ఆయన పేర్కొన్నారు. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా అది శాశ్వతం అని చెప్పారు. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.