Narendra Modi: జీఎస్టీ ఎఫెక్ట్ తో దీపావళి నుంచి ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..!

Goods to Get Cheaper from Diwali with GST Effect
––
దీపావళికి డబుల్ బొనంజా ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వెల్లడించిన విషయం తెలిసిందే. జీఎస్టీలో మార్పులు చేయడం ద్వారా సామాన్యులకు, చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు భారీగా ఉపశమనం కల్పించనున్నట్లు మోదీ తెలిపారు. కేంద్రం తాజాగా జీఎస్టీలో రెండు శ్లాబుల విధానాన్ని ప్రతిపాదించింది. ఈ విధానంలో వస్తుసేవలను రెండు శ్లాబులుగా విభజించి 5 శాతం, 18 శాతం పన్నులు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న 99% వస్తువులు.. 5% పన్ను శ్రేణిలోకి, ప్రస్తుతం 28% పన్ను శ్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%.. 18% పన్ను రేటుకు మారనున్నాయి. దీంతో వస్తుసేవల ధరలు తగ్గుతాయి.

ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయంటే..
టూత్‌ పేస్ట్‌, టూత్‌ పౌడర్‌, హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, లిక్విడ్‌ సోప్స్‌, గొడుగులు, కుట్టు మెషీన్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌, శీతలీకరించిన కూరగాయల వంటి ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, ప్రెజర్‌ కుక్కర్లు, వాటర్‌ ఫిల్టర్లు, ప్యూరిఫయర్లు(నాన్‌ ఎలక్ట్రానిక్‌) ఎలక్ట్రానిక్‌ ఐరన్స్‌, కంప్యూటర్లు, గీజర్లు, వాక్యూమ్‌ క్లీనర్లు (నాన్‌ కమర్షియల్‌), రెడిమేడ్‌ దుస్తులు, రూ.500-1000లోపు ఉన్న చెప్పులు, షూస్, పలు రకాల వ్యాక్సిన్లు, డయాగ్నోస్టిక్‌ కిట్లు, కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు, జామెట్రీ బాక్సులు, మ్యాప్‌లు, గ్లోబ్‌లు, సోలార్‌ వాటర్‌ హీటర్లు, అల్యూమినియం, స్టీల్‌ వంటపాత్రలు, నాన్‌ కిరోసిన్‌ స్టవ్‌లు, సైకిళ్లు, ప్రజా రవాణా వాహనాలు, వ్యవసాయ పరికరాలు, వెండింగ్‌ మెషీన్లు, గ్లేజ్డ్‌ టైల్స్‌ (లగ్జరీ కానీ వేరియంట్లు), సిమెంట్‌, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, డిష్‌ వాషర్లు, కార్లు, మోటార్‌ సైకిల్‌ సీట్లు, సైకిళ్లు, వ్యవసాయ వాహనాలకు వాడే రబ్బర్‌ టైర్లు, ప్లాస్టర్‌, ప్రొటీన్‌ సప్లిమెంట్లు, షుగర్‌ సిరప్‌లు, అరోమా కాఫీ, కాఫీ ఉత్పత్తులు, టాంపర్డ్‌ గ్లాస్‌, అల్యూమినియం ఫాయిల్‌, రేజర్లు, ప్రింటర్లు, మ్యానిక్యూర్‌/పెడిక్యూర్‌ కిట్లు, బీమా ప్రీమియం తగ్గనున్నాయి. ఇక, సేవల రంగంపై 18 శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.
Narendra Modi
GST
Goods and Services Tax
Diwali
Price Reduction
Tax Slabs
Indian Economy
Consumer Goods
Tax Reform
Budget

More Telugu News