Mumbai Landslide: ముంబైలోని విక్రోలీలో కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి.. వీడియో ఇదిగో!

Mumbai Landslide Two Killed in Vikhroli Landslide
  • జనకల్యాణ్ సొసైటీలో అర్ధరాత్రి ఘటన.. నలుగురికి గాయాలు
  • నగరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • 24 గంటల్లో 248 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడి
ముంబైలోని విక్రోలీ (వెస్ట్) లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొండచరియలు విరిగిపడ్డాయి. జనకల్యాణ్ సొసైటీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీమ్ లతో కలిసి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జనకల్యాణ్ సొసైటీలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి స్థానికులను తరలిస్తున్నారు.

వీడని వర్షాలు..
ముంబై నగరాన్ని వర్షాలు వీడడంలేదు. రెండు రోజులుగా సిటీని వర్షం ముంచెత్తుతోంది. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల వరకు సిటీలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. విక్రోలీలో 248.5 మిల్లీమీటర్లు, శాంతాక్రజ్ లో 232.5 మిల్లీమీటర్లు, సియోన్ లో 221 మిల్లీమీటర్లు, జుహూలో 208 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు బాంద్రా, బైకుల్లా, ఛెంబూర్, కొలాబా తదితర ఏరియాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై సిటీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Mumbai Landslide
Vikhroli landslide
Mumbai rains
India Meteorological Department
IMD red alert
Mumbai weather
landslide accident
heavy rainfall Mumbai
Janakalyan Society
Mumbai disaster

More Telugu News