New York Explosion: న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు?

New York City explosion rocks Manhattan neighborhood
  • మాన్ హాటన్ పక్క ప్రాంతం మొత్తాన్ని దట్టమైన పొగ కప్పేసిన వైనం
  • ఈస్ట్95వ స్ట్రీట్,2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్ధంతో పేలుడు
  • మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది
న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. మన్‌హట్టన్ పరిసర ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. స్థానిక కాలమానం ప్రకారం నిన్న ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. అనంతరం అక్కడ భారీ అగ్నిప్రమాదం జరిగింది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ అగ్నిప్రమాద ఘటనతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
New York Explosion
New York City
Manhattan
East 95th Street
2nd Avenue
Fire Accident
New York Fire
New York News
US News

More Telugu News