Ambati Rambabu: చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం: అంబటి రాంబాబు

Ambati Rambabu says Jagans comments on Chandrababu are true
  • చంద్రబాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్ లో ఉన్నారన్న జగన్ వ్యాఖ్యలు నిజమన్న అంబటి
  • సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శ
  • దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అభాండాలు వేస్తున్నారని మండిపాటు
పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవని అన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని ఉంటే... గ్రామాల్లోకి వెళ్లి వారి వేలికి ఉన్న సిరా చుక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. 

నారా లోకేశ్ పై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. మీ ఇంటి భూమిపూజకు మీ మేనత్తలను పిలిచారా? అని ప్రశ్నించారు. మీ బాబాయిని మీ నాన్న ఎలా చూశారో అందరూ చూశారని చెప్పారు. మీరు నిజాయతీగా ఎన్నికలు నిర్వహించి ఉంటే... పోల్ అయిన ఓట్లకు, కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5 శాతం ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో ఉన్నారని... జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కరెక్ట్ అని అన్నారు. సిద్ధాంతం, నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయనకు అవసరం అయితే బీజేపీకి వెళతాడని... అటు నుంచి కాంగ్రెస్ వైపు వెళతాడని... అవసరమైతే మళ్లీ బీజేపీ వైపు వెళతాడని మండిపడ్డారు.
Ambati Rambabu
YS Jagan
Chandrababu Naidu
Pulivendula
Andhra Pradesh Politics
Nara Lokesh
YSRCP
TDP
Rahul Gandhi
Revanth Reddy

More Telugu News