Revanth Reddy: రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్... హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు

Revanth Reddy attends At Home at Raj Bhavan
  • స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్‌లో ఎట్ హోమ్
  • తేనీటి విందు ఇచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • హాజరైన వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిని గవర్నర్, ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.
Revanth Reddy
Telangana Raj Bhavan
At Home program
Governor Jishnu Dev Varma

More Telugu News