Gandhi: రంగారెడ్డి జిల్లాలో 1,500 గాంధీ విగ్రహాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Independence Day Celebrations with 1500 Gandhi Statues in Rangareddy
  • ప్రైవేటు పాఠశాలలో వినూత్నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • మహాత్ముడి గొప్పతనం, విలువలు తెలియజేయాలనే ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • ప్రత్యేక మెమొంటోను అందజేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్
రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వినూత్నంగా జరిగాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడలోని ఒక పాఠశాలలో 1,500 గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు.

మహాత్ముడి గొప్పతనం, ఆయన విలువలు ఈ తరం చిన్నారులకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాఠశాలకు ప్రత్యేక మెమొంటోను అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Gandhi
Rangareddy district
Independence Day celebrations
1500 Gandhi statues

More Telugu News