Sivaji Raja: రంగనాథ్ గారు అలా చేస్తారని ఊహించలేదు: నటుడు శివాజీరాజా

Shivaji Raja Interview
  • రంగనాథ్ గారు అంటే నాకు ఇష్టం 
  • వ్యక్తిత్వం ఉన్న నటుడు ఆయన 
  • ఎన్నో మంచి మాటలు చెప్పేవారన్న శివాజీ 
  • ఆయన సూసైడ్ చేసుకుంటారని అనుకోలేదని వెల్లడి

శివాజీరాజా .. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. దాదాపు 500 సినిమాలకి పైగా చేశారు. ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించారు. అలాంటి శివాజీ రాజా రీసెంటుగా 'తెలుగు వన్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " సీనియర్ ఆర్టిస్టులలో రంగనాథ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు, మంచి కవి కూడా.  అలాంటి ఆయన దర్శకత్వంలో చేయడం కూడా నేను చేసుకున్న అదృష్టమే" అని అన్నారు. 

"రంగనాథ్ గారు ఎన్నో మంచి విషయాలను గురించి మాట్లాడేవారు. తన చుట్టూ ఉన్నవారిని ఆయన ఎడ్యుకేట్ చేసేవారు. ఎందుకంటే ఆయన చూసిన జర్నీ .. పడిన కష్టాలు అలాంటివి. అనారోగ్యంతో ఉన్న భార్యను ఎంతో గొప్పగా చూసుకునేవారు. అలా చూసుకోవడం మరెవరి వలన కాదనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల వలన, ఆయన ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ కాలేకపోయారని అనిపిస్తుంది.  

భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మధ్యలో ముగించకూడదని రంగనాథ్ గారు చెబుతుండేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడాలని అంటూ ఉండేవారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఎవరైనా సరే ఆర్ధికంగా బలంగా లేకపోతే సైకలాజికల్ గా వాళ్లు సగం చచ్చిపోతారు. వాళ్ల చుట్టూ ఉన్న బంధువులు .. స్నేహితులు మిగతా సగం చంపేస్తారు. అందుకోసమే ఎదుటివారి దగ్గర చేయిచాపే పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి అంతే" అని అన్నారు.

Sivaji Raja
Ranganath
Telugu cinema
actor
suicide
financial problems
Tollywood
interview
senior artist
Telugu One

More Telugu News