Viswant: పెళ్లి పీట‌లెక్కిన టాలీవుడ్ యువ‌ హీరో

Tollywood Actor Viswant Enters Wedlock With Bhavana
  • వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరో విశ్వంత్
  • భావన అనే యువతిని పెళ్లాడిన యువ న‌టుడు
  • పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విశ్వంత్‌
  • క్యూట్ క‌పుల్‌కి అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు
టాలీవుడ్ యువ‌ హీరో విశ్వంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే యువతిని పెళ్లాడిన విశ్వంత్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ క్యూట్ క‌పుల్‌కి అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఎలాంటి హ‌డావిడి లేకుండా సింపుల్‌గా మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు ఈ జంట‌. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలోని సామర్లకోటకు చెందిన విశ్వంత్, కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

అప్పుడే సినిమా పట్ల ఆసక్తితో ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాడు. ‘కేరింత’ చిత్రం మంచి హిట్ కావడంతో విశ్వంత్‌కి అవకాశాలు క్యూ క‌ట్టాయి. ఓ పిట్ట కథ, జెర్సీ, హైడ్ అండ్ సీక్, కథ వెనక కథ, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, మ్యాచ్ ఫిక్సింగ్, గేమ్ ఛేంజ‌ర్‌ వంటి చిత్రాల‌లో న‌టించాడు. 

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు విశ్వంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌డంతో అత‌ని నూతన జీవితం ఆనందంగా సాగాలని, సినిమాల్లో మరింత విజయం సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Viswant
Viswanh wedding
Telugu actor marriage
Bhavana Viswanth
Kerintha movie
Telugu cinema news
Tollywood actor
Game Changer movie
Ammayi Gurinchi Meeku Chebuta

More Telugu News